Adilabad: ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్!

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు ముందడుగు అనుకుంట గ్రామంలో 878.13 గుంటల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్.. త్వరలో గ్రామసభ, కలెక్టర్ రాజర్షి షా ప్రకటన.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Sept 2026 9:21 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ (గ్రామీణ) మండలం అనుకుంట గ్రామంలో ప్రజాప్రయోజనాల కోసం ఉమ్మడి వినియోగ విమానాశ్రయం, ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి 878.13 గుంటల భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భూసేకరణకు సంబంధించి అనుకుంట గ్రామంలో త్వరలో గ్రామసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామసభకు వారం రోజుల ముందుగా నోటీసు జారీ చేస్తామని తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూయజమానులు తమ పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ లేదా భూసేకరణ అధికారికి రాతపూర్వకంగా సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.

విమానాశ్రయ ప్రాజెక్టు కోసం గతంలో టాక్లి, కచ్కంఠి, ఆర్లి–బి, నిషాన్‌ఘాట్ గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటికే సేకరించిన భూమికి అదనంగా మరో 2,009.32 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.