Sirikonda: సిరికొండ మండలం సోన్‌పల్లిలో గంజాయి సాగు: వృద్ధుడి అరెస్ట్
Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్‌పల్లిలో రూ.9.80 లక్షల విలువైన 98 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు.
Sirikonda: సిరికొండ మండలం సోన్‌పల్లిలో గంజాయి సాగు: వృద్ధుడి అరెస్ట్
సిరికొండ: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్‌పల్లి గ్రామంలో తన ఇంటి ముందు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న తోడసం ముయ్య (78) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్, సిరికొండ ఎస్సై విక్రంల ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో సుమారు రూ.9.80 లక్షల విలువైన 98 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.
గంజాయి సాగు, విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వ పథకాలు రద్దు చేయిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 150 ఎకరాలకు పథకాలు వర్తించకుండా చర్యలు తీసుకున్నామని సీఐ హెచ్చరించారు.




