Tanur: తానూర్‌లో 9 అడుగుల కొండచిలువ కలకలం!

Tanur: నిర్మల్ జిల్లా తానూర్‌లో పొలంలో కనిపించిన 9 అడుగుల కొండచిలువను స్నేక్ క్యాచర్ సైబాజ్ పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 11 Oct 2026 10:33 AM IST
Tanur
X

Tanur: తానూర్‌లో 9 అడుగుల కొండచిలువ కలకలం!

Tanur: నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. సుమారు 9 అడుగుల పొడవు, 25 కిలోల బరువున్న కొండచిలువను చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సైబాజ్ కు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సైబాజ్ ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అడవిలో సురక్షితంగా వదిలిపెట్టడంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa