Nirmal: పోలీస్ కార్యాలయంలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, పీఠిక పఠనం. హక్కులు-బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచన.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 26 Nov 2026 1:40 PM IST
Nirmal
X

Nirmal: పోలీస్ కార్యాలయంలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం!

Nirmal: భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను పురస్కరించుకుని 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని (సంవిధాన్ దివస్) నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీపోలీస్ అధికారులతో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివి, అందులో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను గౌరవిస్తూ వాటిని ఆచరణలో పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఓ ఎండీ యూనస్ అలీ, ప్రొవిజినల్ డీఎస్పీలు గజార్ సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, చట్టు భవాని, ఆర్ఐ అడ్మిన్ రామ్ నిరంజన్, డీపీఓ సిబ్బంది, ఐటీ కోర్, డీసీఆర్బీ, సైబర్ క్రైమ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL