Nirmal: నిర్మల్ జిల్లా 63 ఏళ్లుగా నిమజ్జనం కాని కర్ర వినాయకుడు!
Nirmal: నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో 63 ఏళ్లుగా నిమజ్జనం చేయకుండా, ఒకే కర్ర వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్న ప్రత్యేక వైనం. తరలివస్తున్న భక్తులు.
Nirmal: నిర్మల్ జిల్లా 63 ఏళ్లుగా నిమజ్జనం కాని కర్ర వినాయకుడు!
Nirmal: నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో 63 యేండ్లు గా ఒకే వినాయకుని భక్తిశ్రద్ధలతో గ్రామమంతా ఒకటై పూజిస్తున్నారు. సంవత్సరాల చరిత్ర గల వరాలు ఇచ్చే ఇక్కడి వరసిద్ది వినాయకుడుకి ఓ ప్రత్యేకత ఉంది. 63 ఏళ్లుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ నిమజ్జనం చేయరు. చివరి రోజు గ్రామం లో అంగరంగ వైభవంగా ఊరేగించి వాగు నీళ్లను చల్లి ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. తిరిగి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠిస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. 1963 నాటి నుంచి నేటి వరకు ఈ గణనాథుడే విశేష పూజలందుకుంటున్నాడు. గ్రామస్థులు ఐక్యమత్యంగా ఉండి మధ్య పనియాలకు దూరంగా ఉంటూ యువకులు, వృద్ధులు అని తేడా లేకుండా నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.ఈ ఒక్కవినాయకుడినే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తున్నదని మండల కమిటీ తెలియజేశారు. ఈ వరసిద్ధి వినకుడిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని తమ మొక్కులను తీర్చుకుంటారు.
గ్రామంలో 150 కొలువులు వరసిద్ధి వినాయకుడి పూజలను నిర్వహించడం ద్వారానే గ్రామంలో దాదాపు 150 ప్రభుత్వ కొలువులు ఇక్కడి ప్రజలు కలిగి ఉన్నారని, భక్తుల విశ్వాసం. పాడి,పంట పరిశ్రమలను ఆ గణనాథుడు చల్లంగా చూస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం.




