Nirmal: ధర్మాజీపేట సమీపంలో ఆటో బోల్తా: వృద్ధుడు దుర్మరణం!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో వృద్ధుడు భీమన్న (62) అక్కడికక్కడే మృతి చెందారు.

RAKESH N, KHANAPUR
Published on: 5 Oct 2026 6:14 PM IST
Nirmal
X

Nirmal: ధర్మాజీపేట సమీపంలో ఆటో బోల్తా: వృద్ధుడు దుర్మరణం!

నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మాజీపేట గ్రామానికి చెందిన భీమన్న (62) ప్రయాణిస్తున్న ఆటో గ్రామ సమీపానికి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో భీమన్నకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఘటన స్థలంలోనే కన్నుమూశారు. స్వగ్రామానికి వస్తూ, ఇంటికి చేరడానికి కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కడెం పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. వృద్ధుడి మరణంతో ధర్మాజీపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR