Siripelli: సిరిపెల్లిలో నవరాత్రి వేడుకలు టేకు కలప దుర్గామాతకు ప్రత్యేక పూజలు!

Siripelli: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి గ్రామంలోని శ్రీ జగత్ జనని జగదీశ్వరి దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Srinivas, Mondol Bhainsa
Published on: 10 Oct 2026 11:15 AM IST
Siripelli
X

Siripelli: సిరిపెల్లిలో నవరాత్రి వేడుకలు టేకు కలప దుర్గామాతకు ప్రత్యేక పూజలు!

Siripelli: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం లోని ఓ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల వేళ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి (హెచ్) గ్రామంలోని శ్రీ జగత్ జనని జగదీశ్వరి దుర్గామాత ఆలయం భక్తిశోభను సంతరించుకోనుంది. 2012లో టేకు కలపతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించగా, అప్పటి నుంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. 13 ఏళ్ల ఆధ్యాత్మిక సంప్రదాయం 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ గ్రామమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగనుంది.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa