Hyderabad: ఇంట్లో మంటలు.. మహిళ సజీవదహనం

Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అగ్నిప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 24 May 2021 12:05 PM IST
Woman Burnt Alive in Fire Hyderabad
X

Hyderabad: ఇంట్లో మంటలు.. మహిళ సజీవదహనం

Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎఫ్‌సీఐ కాలనీలోని ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ఇంట్లో ఒక మహిళ సజీవ దహనం అయ్యింది. ఇంటి యజమాని బాలకృష్ణతో పాటు ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాలకృష్ణను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story