Hyderabad - SR Nagar: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో కిడ్నాప్ కలకలం

Hyderabad - SR Nagar: *ఇద్దరు వృద్ధులను కిడ్నా్ చేసిన దుండగులు *అమీన్‌పూర్‌లోని ఓ ఇంట్లో బంధించిన నలుగురు కిడ్నాపర్లు

Shireesha
Published on: 24 Sept 2021 10:16 AM IST
Two Old Women Kidnap Takes Place in SR Nagar Hyderabad for Money and Gold | Hyderabad News Today
X

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో కిడ్నాప్ కలకలం

Hyderabad - SR Nagar: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్‌పూర్‌లోని ఓ ఇంట్లో బంధించారు. ఇద్దరు వృద్ధురాళ్లు కేకలు వేయడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రక్షించి జీరో FIR నమోదు చేశారు. అనంతరం అమీన్‌పూర్ పీఎస్‌ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు.

అయితే ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసిన దుండగులు వారి నుంచి కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లు, కొంత బంగారాన్ని తీసుకువెళ్లారని బాధితురాలు చెబుతోంది. మీరాజ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అమీర్‌పేట్‌లోని లీలానగర్‌లో బాధితుల పేరు మీద కోట్ల ఆస్తి ఉందని దానికోసమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story