L Ramana: నేడు హైదరాబాద్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

L Ramana: భవిష్యత్ కార్యచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం * రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించిన ఎల్.రమణ

Sandeep Eggoju
Published on: 14 Jun 2021 11:08 AM IST
TTDP President L Ramana Going to Hyderabad To day
X
ఎల్ రమణ (ఫైల్ ఇమేజ్)

L Ramana: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఈరోజు జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. భవిష్యత్ కార్యచరణపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా జగిత్యాలలో ఉన్న రమణ తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించారు. పార్టీ మారటానికి ఇదే సరైన సమయమని సన్నిహితులు రమణకు చెప్పినట్లు సమాచారం.తమ పార్టీలో చేరాల్సిందిగా టీబీజేపీ నేతలు ఆహ్వానం పలుకగా...అధికార టీఆర్ఎస్ వైపే టీటీడీపీ అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే ఆయన గులాబీ గూటికి వెళ్తారని.. ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని ఊహాగానాలు వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఎల్. రమణ సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆహ్వానంపై కార్యకర్తలతో చర్చించారు. వారి నుంచి అభిప్రాయలు తీసుకున్నారు. మరి ఇవాళ ఏం ప్రకటిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story