Top
logo

గ్రేటర్‌లో సెంచరీ టార్గెట్‌.. అన్నీ తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్‌

గ్రేటర్‌లో సెంచరీ టార్గెట్‌.. అన్నీ తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్‌
X
Highlights

GHMC elections : తెలంగాణ గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ లో రాజకీయంగా పాగా వేయడానికి అన్ని రాజకీయ పక్షాలు ...

GHMC elections : తెలంగాణ గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ లో రాజకీయంగా పాగా వేయడానికి అన్ని రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. అధికార పక్షం గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. వరుస ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేటీఆర్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈసారి వంద స్థానాలకు పైగా గెలిచి తీరుతామంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. గులాబీ పార్టీ నేతలు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని క్షేత్ర స్థాయిలో బలపేతం చేయడంపై దృష్టి సారించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేటీఆర్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. బస్తి కమిటీలు,గ్రేటర్ కమిటీలు ఏర్పాటు చేసి పదవుల పంపకాన్ని పూర్తి చేశారు. ఎవరు పదవి రాలేదని అసంతృప్తి పడకుండా ప్రతి కమిటీలో 18 నుండి 20 మందికి చోటిచ్చారు.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపి గ్రేటర్ పీఠంపై కమలం జెండా ఎగురవేస్తామని ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్యాడర్ డిస్టర్బ్ అవ్వకుండా ధైర్యం నింపే పనిలో పడ్డారు గులాబీ పెద్దలు. ప్రతి నియోజకవర్గంలో డివిజన్ల వారీగా కార్పోరేటర్లు ప్రగతి పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు.

మరోవైపు మున్సిపల్ శాఖా మంత్రి హోదాలో కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పూర్తయిన ప్రాజెక్టులకు అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. నగరంలో దాదాపు 20 వేల కోట్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గత ఎన్నికల్లో గ్రేటర్‌లో 99 స్థానాలు గెలిపించిన కేటీఆర్ ఈసారి అంతకు మించి అనే ప్లాన్ తో పనిచేస్తున్నారు.

నగరంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించారు కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లను, SRDP ప్రాజెక్టులో భాగంగా నగరంలో ప్లైఓవర్లను ప్రారంభిస్తున్నారు. జంక్షన్ల అభివృద్ది, చెరువుల సుందరీకణ, రోడ్ల మరమ్మత్తులు, రైల్వే బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ కారిడార్ అభివృద్ధి పనులు ఇలా ప్రతి అంశంపై దృష్టిసారించి పనులు చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం అంతా తానే అయి పార్టీని, అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

Web TitleTRS gears up for GHMC elections
Next Story