తెలంగాణలో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 1 Sept 2020 9:37 AM IST
తెలంగాణలో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,27,697కి చేరింది. మృతుల సంఖ్య 836కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,325 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 95,162కి చేరింది. ప్రస్తుతం 31,699 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరో 24,598 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో 0.65శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.77శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 74.5శాతంగా ఉందని చెప్పింది. తాజాగా సోమవారం ఒకే రోజు 58,264 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 14,23,846 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది. 878 శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 38,358 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 347 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 212, నల్గొండ 191, ఖమ్మం 161, భద్రాద్ది కొత్తగూడెం 117, నిజామాబాద్‌ 114, వరంగల్‌ అర్బన్‌ 112, సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్‌లో 106 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story