అపర్ణా రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు..

K V D Varma
Updated on: 30 July 2019 4:08 PM IST
అపర్ణా రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు..
X

గ్రేటర్ హైదరాబాద్ ఎసర్డీపీ ఫ్లై ఓవర్ పనుల కారణంగా కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ మళ్ళించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ నెల 27 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పనులు పూర్తయ్యే వరకూ ఇవి కొనసాగుతాయి. ప్రతీరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఖానా మెట్ నుంచి కొండాపూర్ మార్గం మూసివేస్తారు. కొండాపూర్ ప్రాంతంలోని అపర్ణా రోడ్డు సాయంత్రం సమయంలో మూసివేస్తారు అందువలన

హైటెక్స్ నుంచి హఫీజ్ పేట వైపు వెళ్లాలనుకునే వారు ఖానా మేట్, హైటెక్స్ మెయిన్ గేట్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ మీదుగా శిల్పారామం వద్ద మెయిన్ రోడ్డుకు కలవాలి.. మరో మార్గం.. హైటెక్స్ జంక్షన్ నుంచి సీఐఐ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story