Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగం, త్రిబుల్ రైడింగ్..ముగ్గురు స్పాట్ డెడ్

AP: తిరుపతి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం
x

 AP: తిరుపతి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

Highlights

Hyderabad: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై టూవీలర్ డివైడర్...

Hyderabad: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై టూవీలర్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించినవారంతా బహదూర్ పురాకు చెందిన మైనర్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం, త్రిబుల్ రైండింగ్ తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరిని మాజ్, అహ్మద్, తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ గా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అనంతరం డెడ్ బాడీలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈమధ్య కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా..వాహనదారులకు అవగాహన లేకపోవడం వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories