Telangana CM KCR Press Meet live updates

K V D Varma
Updated on: 19 March 2020 7:35 PM IST
Telangana CM KCR Press Meet live updates
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై తెలంగాణా ముఖ్యమంత్రి విలేకరులతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు.. ఆయనేమంటున్నారో అక్షర రూపం ప్రత్యక్షంగా..


Live Updates

  • 19 March 2020 7:55 PM IST

    ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు రద్దు : సీఎం కేసీఆర్

    తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.- పూర్తి కథనం 


  • 19 March 2020 7:32 PM IST

    ఇప్పటివరకూ కరోనా తో బాధ పడుతున్న వారిని  హైదరాబాద్  1160 మందిని క్వారంటైన్ చేసి రక్షించాం

  • 19 March 2020 7:30 PM IST

    ఇప్పుడు కరోనా సోకినా వారంతా క్షేమంగా ఉన్నారు. వారిలో ఒక్కరూ మరణించే పరిస్థితి లేదు.

  • 19 March 2020 7:29 PM IST

    కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా.. తక్షణం అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలి. ఇది చాలా అవసరం. వెంటనే రద్దు చేయాలి.

  • 19 March 2020 7:28 PM IST

    వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. తైవాన్ దేశం చైనా పక్కనే ఉంటుంది. కానీ, ఇక్కడ ఎటువంటి కరోనా లేదు.

  • 19 March 2020 7:27 PM IST

    మనకి ప్రమాదం లేదు. చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రజలు బ్రతకాలి, భయానక పరిస్థితులు లేవు. జీవితం స్తంభింప చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్షా 

  • 19 March 2020 7:25 PM IST

    నిర్లక్ష్యం వద్దు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. గుమిగూడ వద్దు. ఎటువంటి పరిస్థితిలోనూ గుంపులుగా తిరగవద్దు 

  • 19 March 2020 7:24 PM IST

    ప్రార్తనలయాల్లో ప్రవేశాలు నిషేధం 

  • 19 March 2020 7:23 PM IST

    నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి, దుకాణాలు యధాతధంగా నిర్వహించుకోవచ్చు.

  • 19 March 2020 7:23 PM IST

    పదో తరగతి పరీక్షలు యధాతథం

    5 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం

    ప్రత్యెక శసానిటైజేషన్  చర్యలు చేపడుతున్నాం 

K V D Varma

K V D Varma

Next Story