Srisailam Fire Accident: ఒకరి మృతదేహం లభ్యం
Srisailam Fire Accident: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం లభ్యమైంది. లోపల రెస్క్యూ సిబ్బంది గాలిస్తుండగా ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంటలు ఆరిపోగా పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మిగతా సిబ్బంది ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Next Story




