Fire Accident in Srisailam power plant: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం

Srisailam power plant fire accident
Fire accident in Srisailam power plant: ఈ తెల్లవారుజామున శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దింతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు.మరి కొంత మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే DE శ్రీనివాస్ గౌడ్, AE నలుగురు సుందర్, మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్ లు ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డీలు మరి కొద్దీ సేపట్లో ఘటన స్థలానికి చేరుకోనున్నారు...