రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం.. ఆరు నెలల్లోపు..

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 8 Aug 2022 12:56 PM IST
Speaker Approves Rajagopal Reddy Resignation
X

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం.. ఆరు నెలల్లోపు.. 

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీలో స్పీకర్ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందించారు. రాజీనామా లేఖ అందించిన కాసేపటికే ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. ఏదైనా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం లేకపోతే ఆరునెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అదే క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లేదా గుజరాత్ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ఖాయం కావడంతో పార్టీలు దృష్టిసారించాయి. వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story