మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు కు దక్షిణ మధ్యరైల్వే చొరవ

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు కు దక్షిణ మధ్యరైల్వే చొరవ
x
Highlights

రోజు రోజుకూ మెట్రో స్టేషన్ల ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య పెద్దదిగా మారుతోంది. మెట్రో ప్రయాణీకులు తమ ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపేసి...

రోజు రోజుకూ మెట్రో స్టేషన్ల ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య పెద్దదిగా మారుతోంది. మెట్రో ప్రయాణీకులు తమ ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపేసి వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ సమస్య పెనుభూతంగా మారిపోయింది.

తార్నాకా, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల వద్ద పరిస్థితి మరింత విషమంగా ఉంది. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు, రోడ్లు కూడా పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా దారి లేని విధంగా పార్కింగ్ వ్యవహారం నడుస్తోంది. ఇక మెట్టుగూడ జంక్షన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద అనధికార వీథి వ్యాపారుల వల్ల పాదచారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తత్ఫలితంగా ఇక్కడ తరచూ ట్రాఫిక్ జామ్ అవడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతోంది. పాదచారులు ఫుటపాతులపై వెళ్లేందుకు చోటులేక రోడ్డు మధ్యలో నడవవలసిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనాలు దీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ సమస్యనుంచి బయట పడటానికి దక్షిణ మధ్య రైల్వే మెట్టుగూడ, తార్నాక మరియు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ల వద్ద రైల్వే ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్ కాంట్రాక్టులను ఆహ్వానించింది. మూడు మెట్రో స్టేషన్ల ప్రక్కనే గుర్తించబడిన ఖాళీ స్థలాల్లో పార్కింగ్ కేటాయింపుల కోసం ఆహ్వానించిన టెండర్లు ఆగస్టు 19, 2019న తెరుస్తారు. దక్షిణ మధ్య రైల్వే సహకారంతో హైదరాబాదు ట్రాఫిక్ పోలీస్, హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ల సమన్వయంతో ఏర్పాటయ్యే పార్కింగ్ వల్ల మెట్టుగూడ, తార్నాక, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ల వద్ద ప్రజల రాకపోకలకు మార్గం సులభతరమౌతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories