Lorry Driver Missing and Died: బస్వాపూర్‌ వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి.. అధికారుల విఫ‌లయ‌త్నం

Lorry Driver Missing and Died: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మోతె వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ శంకర్ మృతి చెందాడు. అత‌ని ప్రాణాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Karampoori Rajesh
Updated on: 15 Aug 2020 9:05 PM IST
Lorry Driver Missing and Died: బస్వాపూర్‌ వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి..   అధికారుల విఫ‌లయ‌త్నం
X
Lorry Driver Missing and Died

Lorry Driver Missing and Died: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మోతె వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ శంకర్ మృతి చెందాడు. అత‌ని ప్రాణాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ప్రమాదం నుంచి లారీ క్లీనర్‌ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్‌ నీటి ఉధృతికి ప్రవాహం లో కొట్టుకు పోయి మరణించాడు. వ‌ర‌ద ప్ర‌వాహంలో లారీ డ్రైవర్ చిక్కుకున్నాడని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్థానిక ఆర్డీఓను ఘటన జరిగిన స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. మంత్రి హరీష్ రావు ఆదేశంతో హెలికాప్టర్ ద్వారా కూడా ప్రయత్నాలు చేశారు. ఉదయం 8 గంటలకే హెలికాప్టర్ పంపవల్సిందిగా కోరినా సైన్యం ను ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ రాక ఆలస్యం అయ్యింది.

మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు కమిషనర్, రెస్క్యూ బృందాలు డ్రైవర్‌ శంకర్‌ను కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించారు. వరద ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు తాడు సాయంతో ప్రయత్నించగా.. నీటి ప్రవాహం ఎక్కువగా రావటంతో చెట్టుతో సహా డ్రైవర్ శంకర్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని ఆచూకీ కోసం హెలికాప్టర్‌తో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు సాయంతో వాగులో గాలింపు చేపట్టాయి. చివరగా డ్రైవర్ శంకర్ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. కాగా, వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన శంకర్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని కాశిరెడ్డి. శంకర్ మృతితో ఆ ఊర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story