లారీ డ్రైవర్ గల్లంతు.. హెలికాప్టర్‌తో గాలింపు

X
Highlights
lorry driver missing river at koheda: వాగులో లారీ కొట్టుకుపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం...
Arun Chilukuri15 Aug 2020 9:43 AM GMT
lorry driver missing river at koheda: వాగులో లారీ కొట్టుకుపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి క్లీనర్ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్ శంకర్ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లి ఒక చెట్టును పట్టుకున్నాడు. శంకర్‌ను కాపాడే యత్నంలో గజ ఈతగాళ్లు తాడును అతనికి అందివ్వగా.. తాడును విడిచిపెట్టడంతో వాగులో కొట్టుకుపోయారు. ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్, ఆర్డీవోలను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రెస్క్యూ బృందం శంకర్ ఆచూకీ కోసం హెలికాఫ్టర్ ద్వారా గాలిస్తున్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘు, ఎస్ఐ రాజా కుమార్, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Web Titlelorry driver missing in river at Koheda
Next Story