Hyderabad-Medaram: మేడారం జాతరకు ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు

RTC Special Buses For Medaram Jatara | TS News Today
x

మేడారం జాతరకు ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు 

Highlights

Hyderabad-Medaram: హైదరాబాద్‌ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు

Hyderabad-Medaram: మేడారం జాతరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​నుంచి మేడారం ప్రత్యేక బస్సు సేవలు ఈనెల 16 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. MGBS నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి అజయ్‌ తెలిపారు. హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు మొదలవుతాయన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్‌లో, టీఎస్ఆర్టీసీ యాప్‌లో టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి వివరించారు. ఈ ప్రత్యేక బస్సులకు రూ.398లు చార్జీలు వసూలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories