PV Narasimha Rao in Congress Party: పీవీ చాణిక్యంతోనే కాంగ్రెస్‌కు హస్తం గుర్తు ఎంపిక..

PV Narasimha Rao in Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ల్లో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేయడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది.

Samba Siva Rao
Published on: 28 Jun 2020 8:11 AM IST
PV Narasimha Rao in Congress Party: పీవీ చాణిక్యంతోనే కాంగ్రెస్‌కు హస్తం గుర్తు ఎంపిక..
X

PV Narasimha Rao in Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ల్లో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేయడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల గుర్తు 'ఆవు, దూడ'ను కాంగ్రెస్ రెబల్ నేతలు సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్-ఐకి హస్తం గుర్తు వచ్చిన తీరును ప్రముఖ జర్నలిస్టు, రచయిత అయిన రషీద్ కిడ్వాయి తాను రచించిన '24 అక్బర్ రోడ్'పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. దీంతో ఇందిర వర్గానికి (కాంగ్రెస్-ఐ) కొత్త గుర్తు ఎంచుకోమని ఎన్నికల సంఘం సూచించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలినప్పుడు పీవీ ఇందిరకే మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ(కాంగ్రెస్-ఐ) ఎన్నికల గుర్తు ఎంపిక చేసేటప్పుడు ఏర్పడ్డ తీవ్ర గందరగోళానికి పీవీ నరసింహరావు తెరదింపారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.

ఎన్నికల సంఘం గుర్తు ఎంచుకోమని అప్పటి (కాంగ్రెస్-ఐ)లోని ముఖ్య నాయకుడు బూటా సింగ్‌కు మూడు ఐచ్ఛికాలు సూచించింది. ఏనుగు, సైకిల్, హస్తం మూడు ఐచ్ఛికాలు ఎన్నికల సంఘం సూచించింది. అందులో హస్తం సింబల్ బాగుంటుందని బూటా సింగ్ భావించారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇందిరకు చెబుతామనుకున్నారు. ఇందుకోసం అప్పట్లో బూటాసింగ్ ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేశారు. అంతరాయం కారణంగా మాటలు సరిగ్గా వినిపించడం లేదు. బూటాసింగ్ హాత్(చేతి గుర్తు) అని చెబుతుంటే.. ఇందిరకు హాథీ(ఏనుగు) అని వినిపడింది. అన్ లైన్లో అంతరాయం కారణంగా ఇందిరాగాధీ అసహనానికి గురయ్యారు. దీంతో ఇందిరాగాంధీ ఇక పక్కనే ఉన్న పీవీకి ఫోన్ రిసీవర్ అందించారు. దాదాపు 17 భాషలపై పట్టు ఉన్న పీవీకి విషయం అర్థమైంది.

బూటాసింగ్ చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల వల్ల గందరగోళం ఏర్పడుతుందని గ్రహించారు. వెంటనే బూటా సింగ్‌కు ఓ ఉపాయం సూచించారు. ''బూటా సింగ్‌ జీ పంజా (చేయి) అని చెప్పండి''అని పీవీ సూచించారు. అయితే, హస్తం గుర్తు పై చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఉందన్న విమర్శలు వచ్చాయి. కానీ ఇందిర అవేం పట్టించుకోలేదని రచయిత రషీద్ కిడ్వాయి రచించిన పుస్తకంలో పేర్కొన్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story