కేటీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన

Traffic Challan: తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Arun Chilukuri
Updated on: 4 Oct 2021 5:39 PM IST
Police Imposes Traffic Challan to KTRs car, Minister Appreciates
X

కేటీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన

Traffic Challan: తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలకైనా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులకైనా నిబంధనలు అందరికీ ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందు ఉంటానని చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ తెలిపారు. బాపు ఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించారని గుర్తు చేశారు‌. తన వాహనానికి విధించిన చలాన్‌ను సైతం చెల్లించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story