బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో చార్జిషీట్ దాఖలు.. అఖిలప్రియ, ఆమె భర్త, సోదరుడిపై అభియోగాలు..

Bowenpally Kidnap Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు పోలీసులు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 11:37 AM IST
Police Filed Chargesheet in Bowenpally Kidnap Case
X

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో చార్జిషీట్ దాఖలు.. అఖిలప్రియ, ఆమె భర్త, సోదరుడిపై అభియోగాలు..

Bowenpally Kidnap Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు పోలీసులు. టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై అభియోగాలు నమోదు చేశారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కూడా అభియోగాలు మోపారు. వ్యాపారవేత్తను ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ చేసిన కేసులో వ్యాపారవేత్త కిడ్నాప్‌నకు ప్లాన్‌ చేసిన సుపారి గ్యాంగ్‌పై కూడా అభియోగాలు నమోదు చేశారు. మొత్తం 16 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు బోయిన్‌పల్లి పోలీసులు. కాగా, గతంలో ఈ కేసు విషయంలో భూమా అఖిలప్రియను అరెస్ట్‌ చేయగా సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story