ఏటీఎం లలో డబ్బులు ఉండవు. ప్రజలకు ఇబ్బందులు తప్పవు!

ములుగు జిల్లా కమలాపురం లోని ఎస్బీఐ, మంగపేట లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం లలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

S. Srikanth
Updated on: 25 Nov 2019 12:56 PM IST
ఏటీఎం లలో డబ్బులు ఉండవు. ప్రజలకు ఇబ్బందులు తప్పవు!
X
ప్రతీకాత్మక చిత్రం

కమలాపురం: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం లోని ఎస్బీఐ, మంగపేట లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం లలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోజుల తరబడి ఏటీఎం లలో సంబంధిత అధికారులు డబ్బులు పెట్టకపోవడంతో అవి తెర్చుకోవడం లేదు.

కమలాపురం లోని ఏటీఎం మద్యాహ్నం వరకు తెరుచుకొని ఆ తరువాత మూతపడుతుంది. ఇక మంగపేట లోని ఏటీఎం సిగ్నల్స్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం వంటి సమస్యలతో వారంలో మూడు రోజులు కూడా తెరుచుకోవడం లేదు. దీంతో ప్రజలు అవసరాల నిమిత్తం ప్రైవేటు గా వ్యక్తుల వద్ద కమిషన్ చెల్లించి డబ్బులు తీసుకుంటున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story