Oxygen Shortage: కరోనా విజృంభణతో ఆక్సిజన్ కొరత

Oxygen Shortage: రాష్ట్రాలకు సవాల్‌గా మారిన ఆక్సిజన్ అందజేత * తెలంగాణలో ఆక్సిజన్ దొరక్క పేషంట్ల నరకయాతన

Sandeep Eggoju
Published on: 21 April 2021 9:28 AM IST
Oxygen Shortage Due to Corona Expanding
X

ఆక్సిజన్ ట్యాంకులు (ఫైల్ ఇమేజ్)

Oxygen Shortage: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం, గతంలో ఎన్నడూ లేనంతగా కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటంతో పేషంట్లకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ అందివ్వడం రాష్ట్రాలకు సవాల్‌గా మారింది. చాలా రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తెలంగాణలో ప్రైవేటు ఆసుత్రుల్లో ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్ బాదితులు.

హైదరాబాద్ నగరంలో 150 ఆక్సిజన్ ఎజెన్సీలు ఉండగా ఏ ఒక్కటి ఓపెన్ లేకపోవడంతో ప్రస్తుతం పరిస్ధితి ప్రశ్నర్ధకంగా మారింది. ఆక్సిజన్ దొరికే ఒకటి అర ఏజేన్సీల వద్ద ప్రజలు వాహనాలల్లో ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం వారి దగ్గర సరిపడ ఆక్సిజన్ లేకపోవడంతో చేసేది లేక చేతులు ఎత్తేస్తున్నారు.

ఇక ఆసుపత్రుల్లో వైద్యలు సూచన మేరకు కొంత మంది ఆక్సిజన్ ఎజేన్సీలను నమ్ముకుని పరుగులు పెడుతున్నారు. ఐనా ఎక్కడ గ్యాస్ ఎజెన్సీలు ఓపెన్ లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గతంలో కోవిడ్ కు ముందు లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌లతో బాదపడుతు కేవలం ఆక్సిజన్‌లపై ఆధారపడిన వారి పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. ఒక్క 5 నిమిషాలు ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాస అందించక పోతే తమ వారు ప్రాణాలు కోల్పోతారని ఆందోళన పడుతున్నారు.

ప్రస్తుతం నగరంలో కేవలం 100 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని.. డిమాండ్ మాత్రం 300 టన్నులు ఉందని... ప్రభుత్వం సహకరిస్తే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ గ్యాస్ తయారి, డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీ స్పష్టం చేసారు.

ఎక్కడ చూసిన ఆక్సిజన్ కొరతతో తమ వారి ప్రాణాలు పోతున్నాయనే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్ధితితో పాటు రాబోయో రోజులను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story