Vemulawada: అమానవీయం.. కుమారుడు తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదని తల్లి కిడ్నాప్‌

Vemulawada: తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని మహిళను కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కొడుముంజలో జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Nov 2024 1:19 PM IST
Mother Kidnapped for Sons Debt in Vemulawada
X

Vemulawada: అమానవీయం.. కుమారుడు తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదని తల్లి కిడ్నాప్‌

Vemulawada: తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని మహిళను కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కొడుముంజలో జరిగింది. చెరుకు కోత కోసం మహారాష్ట్రకు చెందిన లాల్ దేవాకర్ అనే గుత్తేదారు 3 లక్షల రూపాయలను పల్లపు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో శ్రీనివాస్ సోదరులు పనిచేస్తుండటంతో మహారాష్ట్రకు వెళ్లేందుకు వారికి కుదరలేదు. చెరుకు కోత కోసం కూలీలు రాకపోవడంతో దేవాకర్, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది.

దేవకర్‌ అనుచరులు బుధవారం కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్‌ భార్య, అతడి కుటుంబసభ్యులపై దాడి చేశారు. అనంతరం తల్లి పల్లపు బీమాబాయిని కారులో తీసుకెళ్లారు. దీనిపై శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story