MLA Harish Rao: దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదు: మంత్రి హరీశ్ రావు

MLA Harish Rao: దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదని, బీజేపీకి డిపాజిట్ దక్కదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు. డబ్బాలో రాళ్లు వేసి ఊపిన‌ట్లు .. సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని , వారిపార్టీకి చేత కాద‌ని హ‌రీష్ రావు విమ‌ర్శించారు.

Karampoori Rajesh
Published on: 16 Oct 2020 1:19 PM IST
MLA Harish Rao: దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదు: మంత్రి హరీశ్ రావు
X

MLA Harish Rao: దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదు: మంత్రి హరీశ్ రావు

MLA Harish Rao: దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదని, డిపాజిట్ కూడా దక్కదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు. డబ్బాలో రాళ్లు వేసి ఊపిన‌ట్లు .. సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని , ఆ పార్టీకి చేత కాద‌ని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. నేడు దుబ్బాక ఉప‌ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీశ్ రావు చీకోడ్ ప్ర‌చారంలో పాల్గోన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు బోగస్ ప్రచారంలో చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాల‌న‌లో రైతులు మందు బస్తాకు దుబ్బాకకు పోతే.. చెప్పులు లైన్లో పెట్టాల్సి ఉండేదని అన్నారు. కెసిఆర్ పాల‌నలోని వచ్చినాక మీ ఊరికే మందు బస్తాలు వస్తున్నాయ‌ని అన్నారు. రూ. 7250 కోట్లు వానా కాలం పంటకు రైతు బంధు తెరాస ఇస్తే..బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందని అని విమ‌ర్శించారు. బీడీ కార్మికులకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి ఇచ్చారని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ పాల‌న‌లో దొంగరాత్రి కరెంటు కాంగ్రెస్ ఇస్తే. ..తెరాస 24 గంటల కరెంటు ఇచ్చిందని గుర్తు చేశారు. కరెంటు ఇవ్వక కాంగ్రెస్ రైతులను చంపితే...బీజేపీ బావుల దగ్గర మీటర్లు పెట్టి చంపాలని చూస్తోందని విమ‌ర్శించారు. జగన్ కేంద్రం నుంచి డబ్బులు తీసుకుని శ్రీకాకుళంలో మీటర్లు పెట్టడం ప్రారంభించారని, కేసీఆర్ మేం మీటర్లు పెట్టం అని ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story