తక్షణ సాయంగా రూ.1350 కోట్లివ్వండి: ప్ర‌ధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

తక్షణ సాయంగా రూ.1350 కోట్లివ్వండి: ప్ర‌ధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
x
Highlights

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.5వేల కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు....

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.5వేల కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తక్షణ సాయంగా రూ. ఒక వెయ్యి 350కోట్లు అందించాలని లే‌ఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ఇప్ప‌టికే తీసుకున్న స‌హాయ‌క చ‌ర్య‌లు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం స‌మీక్షించారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రానికి 5వేల కోట్లు నష్టం జరిగిందని అంచానా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories