నాయిని ఆరోగ్యం విషమం!

నాయిని ఆరోగ్యం విషమం!
x
Highlights

Naini Narshimha Reddy Health : టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. న్యుమోనియా కారణంగా ప్రస్తుతం నాయిని జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Naini Narshimha Reddy Health : టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. న్యుమోనియా కారణంగా ప్రస్తుతం నాయిని జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28 వ తేదిన కరోనా బారిన పడిన నాయిని.. అక్కడ చికిత్స తీసుకోగా పది రోజుల తర్వాత కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయనకి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షలలో ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు గుర్తించారు. దీనితో అయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఈ క్రమంలో అయనని మంగళవారం హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ మేరుగైన చికిత్స కోసం అక్కడే ఉన్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి కరోనా నుంచి కోలుకుంటున్నారు. అటు నాయిని త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆలయాల్లో పూజలు చేశారు. నాయినికి ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories