ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం: కేటీఆర్

ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం: కేటీఆర్
x
Highlights

Basti Dawakhanas: హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్...

Basti Dawakhanas: హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బస్తీ దవాఖానాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలోని 197 బస్తీ దవాఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతీ రోజు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు కేటీఆర్.

ఇక, ప్రతీ రోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలకీ, బయో కెమిస్ర్టీ వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజు 25 వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయని, బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మరో వంద బస్తీ దవాఖానాల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories