పరాయి మహిళలను అమ్మ లేదా అక్కచెల్లెలుగా చూడాలి : హరీష్ రావు

admin1
Published on: 10 Dec 2019 8:39 PM IST
పరాయి మహిళలను అమ్మ లేదా అక్కచెల్లెలుగా చూడాలి  : హరీష్ రావు
X
Harish rao ( File photo)

సమాజంలో అబ్బాయిల తీరు మారాలని, పరాయి మహిళలను అమ్మ లేదా అక్కచెల్లెలుగా చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చక్కగా చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. సిద్ధిపేటలో పర్యటించిన హరీశ్ రావు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బాలుర జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. తనకు సత్కారంగా అభిమానులు తెచ్చిన నోట్ బుక్స్ ను హరీశ్ రావు విద్యార్థులకు అందజేశారు.ఎగ్జామ్ టైమ్ సమీపిస్తోందని, సెల్ ఫోన్ లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు.

admin1

admin1

Next Story