మెట్రో ఇక నాలుగు నిమిషాలకు ఓ సారి!

మెట్రో ఇక నాలుగు నిమిషాలకు ఓ సారి!
x
Highlights

ప్రతి నాలుగు నిమిషాలకూ ఓ మెట్రో రైలు ఇక పరుగులు తీయనుంది. ఈ మేరకు అధికారులు ఇక ప్రకటన చేశారు.

ప్రతి నాలుగు నిమిషాలకూ ఓ మెట్రో రైలు ఇక పరుగులు తీయనుంది. ఈ మేరకు అధికారులు ఇక ప్రకటన చేశారు. మొదట్లో అమీర్ పేట నుంచి జూబ్లీ హిల్స్ వరకూ నడిచిన మెట్రో రైలును, కొంత కాలంగా హైటెక్ సిటీ వరకూ పొడిగించారు. అయితే, ఈ దారిలో రివర్సల్ సిస్టం అందుబాటులో లేకపోవడంతో 8 నిమిషాలకు ఓ మెట్రో నడిచేది. అయితే, ఇప్పుడు రివర్సల్ సిస్టం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో రైళ్ళ ఫ్రీక్వెన్సీ ని తగ్గించడానికి మార్గం సుగమమైంది. ఇక అమీర్ పేట-హైటెక్ రూట్ లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలు నడపనున్నారు. ఈ విధంగా నాలుగు వారాల పాటు నడుపుతారు. తరువాత పరిస్థితులను అంచనా వేసి ప్రతి 3 నిమిషాలకూ ఒక రైలు నడపడానికి ప్రయత్నిస్తున్నట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకూ ప్రతి 5 నిమిషాలకు ఓ మెట్రో రైలు నడుపుతారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories