Telangana‌: తెలంగాణలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు

* 14 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి

Sandeep Reddy
Published on: 13 Aug 2021 7:21 AM IST
Massive Transfers of District Judges in Telangana
X

జడ్జిల బదిలీలు (ఫైల్ ఫోటో)

Telangana‌: తెలంగాణ రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.వీరయ్య నియమితులయ్యారు. కొందరు సీనియర్ సివిల్ జడ్జిలను తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ జిల్లాలకు పంపించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story