వైభవంగా మహంకాళి బోనాల ఉత్సవాలు: కాసేపట్లో రంగం కార్యక్రమం

K V D Varma
Updated on: 22 July 2019 11:04 AM IST
వైభవంగా మహంకాళి బోనాల ఉత్సవాలు: కాసేపట్లో రంగం కార్యక్రమం
X

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉజ్జయిని బోనాల ఉత్సవాలలో చివరి ఘట్టం రంగం.. రంగం కార్యక్రమంలో అమ్మవారు పూనిన స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. కాసేపట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు అడిగే ప్రశ్నలకు స్వర్ణ లత సమాధానాలు చెబుతారు. ఫలహారం బళ్ల ఊరేగించి, అమ్మవారికి సమర్పిస్తారు.

K V D Varma

K V D Varma

Next Story