Clashes between Two Communites: పొలం గ‌ట్టు వివాదంలో హత్యోందంతం.. ఉద్రిక్తత పరిస్థితులు

Clashes between Two Communites: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఓ పొలం గ‌ట్టు వివాదం హత్యోందంతంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కొత్తగూడ మండలంలో రౌతుగూడెంలో రెండు వర్గాలు పోటాపోటాగా దాడులు చేసుకున్నాయి.

Karampoori Rajesh
Published on: 4 Aug 2020 1:35 PM IST
Clashes between Two Communites:  పొలం గ‌ట్టు వివాదంలో హత్యోందంతం.. ఉద్రిక్తత పరిస్థితులు
X
Clashes between Two communites,

Clashes between Two Communites: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఓ పొలం గ‌ట్టు వివాదం హత్యోందంతంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కొత్తగూడ మండలంలో రౌతుగూడెంలో రెండు వర్గాలు పోటాపోటాగా దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా రెండు వర్గాల నుంచి పదుల సంఖ్యలో గాయపడ్డారు.పొలం స‌రిహ‌ద్దు వివాదంలో ఆంగోతు బాలు అనే వ్యక్తికి, అతని ప్రత్యర్థి బాబూలాల్ మధ్య వివాదం మొదలైంది. భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘ‌ట‌న‌లో బాలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలు మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు ప్రత్యర్థి హతీరామ్ ఇంటిని, ట్రాక్టర్ ను తగలబెట్టారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరునకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story