Road Accident in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

Arun Chilukuri
Updated on: 16 July 2020 11:20 AM IST
Road Accident in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
X

Road Accident in Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా కర్రలోడును తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు హార్యా(37), గోవింద్‌( 38), మధు(35), రాట్ల ధూర్యా(36)లుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్ లోడుతో పాటు అతివేగం కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండాకు చెందిన 11 మంది కూలీలు చీకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో తుమ్మకర్రను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌కు తరలించేందుకు కూలీ పనులకు వెళ్లారు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగివస్తున్న క్రమంలో వర్షం పడటంతో చీకటాయపాలెం చెరువు కట్టపై లారీ బోల్తాపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story