మహబూబాబాద్‌ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

admin
Published on: 19 Nov 2019 5:49 PM IST
ప్రతీకాత్మక చిత్రం
X
ప్రతీకాత్మక చిత్రం

ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దంతాలపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల శంకర్‌ అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో దంతాలపల్లి రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

తమ భూమిని గ్రామ రెవెన్యూ అధికారి లావణ్య వేరే వ్యక్తికి పట్టా చేసిందని మనస్తాపం చెందాడు. తనకున్న 8 ఎకరాల భూమిని అక్రమంగా వీఆర్‌ఓ లావణ్య సహాయంతో తండా సరిత పట్టా చేయించుకుందని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తన 8 ఎకరాల భూమిని తనకు అందించాలని డిమాండ్‌ చేశాడు.



admin

admin

Next Story