తెలంగాణలో కొత్త మినహాయింపులు... నేటి నుంచి తెరచుకునేవి ఇవే...

తెలంగాణలో కొత్త మినహాయింపులు... నేటి నుంచి తెరచుకునేవి ఇవే...
x
CM KCR(File photo)
Highlights

తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు కరోనా ఫ్రీ కావడంతో ప్రభుత్వం మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు కరోనా ఫ్రీ కావడంతో ప్రభుత్వం మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తోంది.ఇందులో భాగంగానే గత వారం నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు, రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు, ఆర్టీఏ ఆఫీసులు నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ అమలవుతున్నాయి.

ఇదే నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆటోమొబైల్ షోరూంలు, స్పేర్ పార్ట్స్ షాపులు, ఏసీలు, ఎయిర్ కూలర్లు అమ్మే షాపులు కూడా తెరిచేందుకు ఒప్పుకుంది. ఇక మిగతా వ్యాపార సముదాయాలు తెరిచే విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కేంద్రం రేపు విడుదల చేసే కొత్త మార్గదర్శకాల్ని లెక్కలోకి తీసుకొని సోమవారం నుంచి లేదా మంగళ వారం నుంచి వెసులుబాట్లు కల్పించాలో కేసీఆర్ నిర్ణయించనున్నారు. ఇక పోతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముందు రెండు ముఖ్యమైన సమస్యలు కనిపిస్తున్నాయి. మొదటిది రాష్ట్రంలో వలస కూలీల ద్వారా ఇతర ప్రజలకు కరోనా సోకకుండా చూడటం. రెండోది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకోవడం. ఈ రెండు విషయాలపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోందని తెలిసింది. ఇక పోతే రాష్ట్రంలో చాలా జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలు కావడం, అలాగే మే 17న లాక్‌డౌన్ ముగియడంతో ప్రభుత్వం నెలాఖరు వరకూ ఆగకుండా ఇప్పుడే వెసులుబాట్లు, సడలింపులకు తెరతీసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories