Liquor Sales Increased In Hyderabad : లాక్‌డౌన్‌ పెడతారన్న ప్రచారంతో పెరిగిన విక్రయాలు

Liquor Sales Increased In Hyderabad : లాక్‌డౌన్‌ పెడతారన్న ప్రచారంతో పెరిగిన విక్రయాలు
x
Highlights

Liquor Sales Increased In Hyderabad Due To Lockdown : హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం గతంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించడంతో...

Liquor Sales Increased In Hyderabad Due To Lockdown : హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం గతంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించడంతో మద్యం దొరకని అనుభవాలు ఇవన్నీ మందుబాబులు ముందు జాగ్రత్త పడేటట్లు చేసాయి. దీంతో రికార్డు స్దాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే. మద్యం సేల్స్‌‌ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌ లో మళ్లీ లాక్‌డౌన్ పుకార్లతో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. దీంతో డిపోల నుంచి పెద్ద ఎత్తన మద్యం కొనుగోలు చేస్తున్నారు వైన్స్ షాపుల యజమానులు. లాక్ డౌన్ పై సీఎం ప్రకటన తర్వాత 2 రోజుల్లో 350 కోట్ల అమ్మకాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం రోజుకు సరాసరిగా 100 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా వారం రోజుల్లో 700 కోట్ల రూపాయల సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

గత అనుభవం దృష్ట్యా లాక్‌డౌన్ ఉంటుందేమోనని ముందు జాగ్రత్తపడ్డ మద్యం ప్రియులు మద్యాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. మార్చి 22 న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టింది. అప్పటి నుండి మే 6 వరకు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. అకస్మాత్తుగా మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబులు పడ్డ తిప్పలు అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఎంత పెట్టైనా మద్యం కొనడానికి సిద్ధం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మద్యం ప్రియులు స్టాక్ పెట్టుకుంటున్నారు.

జూన్ 29న 185 కోట్ల 45 లక్షల మద్యం అమ్ముడుపోగా జూన్ 30 న 164 కోట్ల సేల్జ్ జరిగింది. జూన్ నెలలో 2 వేల 389 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే కేవలం ఈ వారం రోజుల్లోనే 700 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 5 వేల కోట్ల రాబడి వచ్చింది. జూన్‌ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో 18 వందల 64 కోట్ల సేల్‌ జరిగింది. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు 70 నుంచి 75 కోట్ల మద్యం లిఫ్ట్‌ చేస్తుంటారు. కానీ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల్లో 150 కోట్లకు పైగా విక్రయాలు సాగాయి.Show Full Article
Print Article
Next Story
More Stories