Laldarwaza Bonalu Festival 2020: ఘనంగా లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు...

Laldarwaza Bonalu Festival 2020: ఘనంగా లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు...
x
Laldarwaza Bonalu 2020
Highlights

Laldarwaza Bonalu Festival 2020: ఆషాఢం వచ్చిందంటే చాలు డప్పుచప్పుల్లతో, శివసత్తుల పూనకాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తుంటారు.

Laldarwaza Bonalu Festival 2020: ఆషాఢం వచ్చిందంటే చాలు డప్పుచప్పుల్లతో, శివసత్తుల పూనకాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆషాఢం మాసంలో ఈ ఆదివారం చివరిది కావడంతో నేడు ఉదయాన్నే సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం తెల్లవారుజామునే బలగంప కొనసాగింది. ఆ తరువాత అర్చకులు జల కడవను అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారికి ఒక్క బోనాన్ని ఆలయ కమిటీ తరఫున అధికారికంగా సమర్పించింది. సోమవారం పోతరాజు స్వాగతం, రంగం (భవిష్యవాణి) కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిమితంగా కమిటీ సభ్యులతో ఘట ఊరేగింపు ఉంటుంది. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శాంతి కల్యాణం జరగనుంది.

ఇక పోతే ప్రస్తుతం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో బోనాలకు భక్తులను అనుమతించడం లేదు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు కోవిడ్‌ నిబంధనలలో భాగంగా నో ఎంట్రీ సూచికలను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు...ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుండి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లు మూసివేశారున.

వాస్తవానికి పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కానీ కరోనా సోకుతున్న కారనంగా భక్తులు ఇళ్లలోనే బోనాల సమర్పణకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆయా ప్రాంతాలలోని దేవాలయాల్లో కమిటీ తరఫున మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories