Coronavirus Updates in India: భారత్ లో ఒక్క రోజే 38,902 కేసులు.. 543 మరణాలు

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

S. Srikanth
Updated on: 19 July 2020 10:58 AM IST
Coronavirus Updates in India: భారత్ లో ఒక్క రోజే 38,902 కేసులు.. 543 మరణాలు
X
Representational Image

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 కేసులు నమోదు కాగా, 543 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 10,77,618 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,73,379 ఉండగా, 6,77,423 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 26,816 మంది కరోనా వ్యాధితో మరణించారు. గురువారం దేశవ్యాప్తంగా 358127 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 13791869 కరోనా టెస్ట్‌లు చేసినట్లు వెల్లడించింది. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 63శాతం రికవరీ రేటు ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహారాష్ట్రలో 300937కేసులు, తమిళనాడులో 165714, ఢిల్లీలో 121582, కర్ణాటకలో 59652, గుజరాత్‌లో 47390, ఆంధ్రప్రదేశ్‌లో 44609, తెలంగాణలో 43780, బెంగాల్‌లో 40209 కేసులున్నాయి. ఈ 8 రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అత్యదిక కేసులు నమోదవుతున్నాయి.


S. Srikanth

S. Srikanth

Next Story