'ఆవో-దేఖో-సీకో'.. ప్ర‌ధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ‌

KTR Writes Open Letter to PM Modi
x

‘ఆవో-దేఖో-సీకో’.. ప్ర‌ధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ‌ 

Highlights

KTR Letter To PM Modi: ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

KTR Letter To PM Modi: ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రేపటి సమావేశాల్లో విద్వేష విభజన అజెండా కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడండి అంటూ లేఖలో సూచించారు. పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన తెలంగాణ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండని కోరారు. డబుల్‌ ఇంజిన్‌తో ప్రజలకు ట్రబుల్‌గా మారిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయడంటూ చురకలు అంటించారు మంత్రి కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories