ఆర్టీసీ సమ్మెపై ముగిసిన కేసీఆర్‌ సమీక్ష

admin1
Published on: 27 Oct 2019 8:13 PM IST
ఆర్టీసీ సమ్మెపై ముగిసిన కేసీఆర్‌ సమీక్ష
X

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. రేపు కోర్టుకు ఇవ్వనున్న నివేదికను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సమావేశంలో రవాణాశాఖకు ఆదేశించారు సీఎం. సమ్మెపై చాలా ఓపిక పట్టామని సమావేశంలో అభిప్రాయపడ్డారు‌.అయితే మరోపక్క నిన్న యాజమాన్యంతో జరిగిన భేటీ వివరాలను ఆర్టీసీ జేఏసీ నేతలు వివరించారు. యాజమాన్యం కేవలం 21 అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చర్చిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. తాము లేవనెత్తిన 45 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. యాజమాన్యానికి జేఏసీ తరపున తెలియజేస్తున్నామన్నారు.


admin1

admin1

Next Story