Kathi Mahesh : మరోసారి అరెస్ట్ అయిన కత్తి మహేష్..

Kathi Mahesh Arrested Once Again: నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో...
Kathi Mahesh Arrested Once Again: నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత పోస్టులు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేశారు. 'రాముడు కరోనా ప్రియుడు' అని పోస్టులు చేయడంతో కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. స్పందించిన పోలీసులు 154 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. తాజాగా ఈయనను మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఫిబ్రవరి నెలలో ఈయన ఇలాగే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ జాంబాగ్‌కు చెందిన ఉమేష్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో కత్తి మహేష్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రావు తెలిపారు.