Top
logo

Telangana Govt on Coronavirus: సోషల్ మీడియాను ఫాలో అయితే ఇబ్బందే.. కరోనాపై స్పష్టం చేసిన ప్రభుత్వం

Telangana Govt on Coronavirus: సోషల్ మీడియాను ఫాలో అయితే ఇబ్బందే.. కరోనాపై స్పష్టం చేసిన ప్రభుత్వం
X

Representational Image

Highlights

Telangana Govt on Coronavirus: కరోనా వచ్చినదగ్గర్నుంచి మీరు ఉదయమే ఇది వాడండి...మధ్యాహ్నం ఇది చేయండి..

Telangana Govt on Coronavirus: కరోనా వచ్చినదగ్గర్నుంచి మీరు ఉదయమే ఇది వాడండి...మధ్యాహ్నం ఇది చేయండి.. అంటూ సోషల్ మీడియాలో అధికంగా మెసేజ్ లు వస్తున్నాయి. ఈ విధంగా చేసే పలానా వ్యక్తి నార్మల్ అయ్యాడు. ఎటువంటి ఇబ్బంది లేదు.. భయపడకండి.. ఇలా డాక్టర్ల పేరుతో వచ్చే మెసేజ్ ల వల్ల అధికశాం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. ఇలంటి వాటిని నమ్మకుండా ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ప్రభుత్వం సూచిస్తోంది.

నిజామాబాద్‌లో రామచందర్‌ (పేరు మార్చాం) సీనియర్‌ డాక్టర్‌. ఇటీవల అతనికి కరోనా సోకింది. దీనికి ఎ లాంటి ప్రొటోకాల్‌ వైద్యం తీసుకోవా లో అతనికి తెలియదు. సోషల్‌ మీడియాలో మరో వైద్యుడి సలహా మేరకు 10 రకాల మందులు వాడారు. పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆరాతీస్తే.. సోషల్‌ మీడియాలో పంపించిన ప్రి్రíస్కిప్షన్‌ సరైంది కాదని తేలింది.

► కరీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నాగేందర్‌ జలుబు, జ్వరం రాగా, సో షల్‌ మీడియాలో జలుబు, జ్వరానికి సంబంధించిన మందులంటూ కొన్ని కనిపిస్తే.. వాడాడు. అవి వాడితే జ్వరం తగ్గకపోగా, శ్వాస తీసుకోవడం కష్ట మైంది. ఆసుపత్రికి వెళ్తే ఆలస్యం చేశారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నాడు.

ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా ఎవరికివారు డాక్టర్లు అయిపోయారు. కొం దరేమో హోమియో అంటే.. మరొకరు ఆయుర్వేదం అంటారు. ఇంకొకరు అల్లోపతిలో ఇదే సరైన మందు అని సవాల్‌ విసురుతారు.

కొందరు డాక్టర్లయితే లక్షణాలున్నా కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని, సాధారణ వైరల్‌ ఫీవర్‌ అంటూ ఊ దరగొడుతున్నారు. ఇటీవల వరంగల్‌లో ఒక హోమియో డాక్టర్‌ తన వద్ద ఉన్న మందుతో కరోనాను జయించవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. చివరకు అతని క్లినిక్‌ను ప్రభుత్వం సీజ్‌ చేసిం ది. ఖమ్మంలో ఒక డాక్టరైతే కరోనా లక్షణాలు లేకున్నా ముందస్తుగా ఐదు రోజుల కోర్సు వాడాలని, కరోనా పాజిటివ్‌ వస్తే 10 రోజుల కోర్సుతో మందులను తనకు తెలిసిన వ్యక్తులకు, పెద్ద పెద్ద స్థాయిలోని వారికి కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్రిస్కిప్షన్‌ పంపిస్తున్నారు. దీన్ని నమ్మి అనేకమంది ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.

ఫిర్యాదుల వెల్లువ: కొందరు ఫార్మసిస్టు లు, ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లు, వైరస్‌ చికిత్సతో సంబంధంలేని వైద్యులు తమకు తెలిసిన మందులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చే స్తున్నారు. డాక్టరే కదా చెప్పిందంటూ వీటి ని చాలామంది వాడేస్తున్నారు. డబ్ల్యూహె చ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచించినట్లుగా ప్రొటోకాల్‌ పాటించట్లేదు. పైగా కరోనా ఉన్న ప్ర తీ రోగికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. లక్షణాలను బట్టి వైద్యం చేయాలి. ఉదాహరణకు బీపీ ఉన్న రోగులకు ఒకరకంగా, షుగర్‌ ఉన్న రోగులకు మరోరకంగా, ఇతరత్రా దీర్ఘకాలిక రోగాలున్న వారికి ఒకరకంగా వైద్యం ఉంటుంది. సోషల్‌ మీడియాలో వస్తున్న పలు పోస్టులపై ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులందాయి. దీనిపై ఏంచేయాలనేది అధికారులు యో చిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ వైద్యులకు వైద్య ఆరోగ్యశాఖ కరోనా చికిత్స ప్రొటోకాల్‌ను సిద్ధం చేసి పంపించింది. కానీ ప్రైవేట్‌ వైద్యులకు అటువంటి మార్గదర్శకాలు ఏవీ లేకపోవడంతో ఒక్కోచోట ఒక్కోరకంగా చికిత్స జరుగుతోంది. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్న జాగ్రత్తలు...

► సోషల్‌ మీడియాలో వచ్చే సూచనలను పాటించవద్దు. జనరల్‌ ఫిజీషియన్, ఫల్మనాలజిస్ట్‌ సహా కరోనా చికిత్సలో పాలుపంచుకుంటున్న వైద్యుల సలహాలనే ఆచరించాలి.

► దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త వహించకూడదు. తక్షణమే వైద్యుడిని కలవాలి.

► సోషల్‌ మీడియాలో కొందరైతే ధైర్యం పేరుతో నిర్లక్ష్యంగా ఉండేలా పోస్టులు పెడుతున్నారు. దీంతో బాధితులు డాక్టర్‌ వద్దకు వెళ్లడం మానుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.

► ప్రైవేట్‌ వైద్యులు వైద్యం పేరుతో బాధితులపై ప్రయోగం చే యకూడదు. అలా చేసినట్లు తేలితే రిజిస్ట్రేషన్‌ రద్దవుతుంది.

Web TitleTelangana Government has made it clear on coronavirus over following social media
Next Story