కరోనాతో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు మృతి..!

Arun Chilukuri
Published on: 9 Sept 2020 5:24 PM IST
కరోనాతో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు మృతి..!
X

కరోనాతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్యమిత్రుడు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటి ఛైర్మన్ బొమ్మెర వెంకటేశం కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేశం స్వస్థలం సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం చెర్వాపూర్‌. వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు. ఆయన కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌గా రెండు పర్యాయాలు కొనసాగారు. వెంకటేశం మృతిపట్ల ఆలయ ఈవో మారుతి, అర్చకులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.






Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story