Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,479 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 9 Sept 2020 8:26 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,479 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,479 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2485 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,642కి చేరింది. మృతుల సంఖ్య 916 కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,15,072 కి చేరింది. ప్రస్తుతం 31,654 మంది చికిత్స వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.62 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 76.2కు చేరుకుంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిదిలో 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో 17,30,389 కరోనా పరీక్షలు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ- 322, రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 183, నల్గొండ జిల్లాలో 108, కరీంనగర్ జిల్లాలో 120, ఖమ్మం జిల్లాలో 94, వరంగల్ అర్బన్ జిల్లాలో 124 సూర్యాపేట జిల్లాలో 96 కేసులు నమోదు.గడిచిన 24 గంటల్లో 62,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,90,554 మందికి కరోనా పరీక్షలు చేశారు.




S. Srikanth

S. Srikanth

Next Story