Hetero Drugs - IT Raids: హెటిరో సంస్థలో నాలుగో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

*సోదాల్లో రూ.142.87 కోట్ల నగదు సీజ్ *6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు *నకిలీ ఇన్వాయిస్‌లు తయారు చేసినట్లు గుర్తింపు

Shilpa
Published on: 9 Oct 2021 1:34 PM IST
IT Raids 4th day Continues on Hetero Drugs Pharma Company Telangana Andhra Pradesh
X

హెటిరో సంస్థలో నాలుగో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Hetero Drugs - IT Raids: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ దిగ్గజ కంపెనీ హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సోదాల్లో వందల కోట్ల నగదు సీజ్ చేసినట్లు సమాచారం. సంస్థ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ముఖ్యమైన అధికారులు, ఉద్యోగుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయల నగదును కంపెనీ ఉద్యోగుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ, ఏపీ సహా 6రాష్ట్రాల్లో సుమారు 50 చోట్ల ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ పలుచోట్ల నుంచి 142 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 బ్యాంక్ లాకర్లను గుర్తించింది ఐటీశాఖ. ఇప్పటివరకు లెక్కల్లో చూపని 550 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు అధికారులు.

Shilpa

Shilpa

Next Story